
ఉపకార వేతనాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
అనకాపల్లి: జిల్లాలో వివిధ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ, బీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రిన్సిపాల్ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి బి.రామానందం తెలిపారు. స్థానిక జాతీయ రహదారి డైట్ కళాశాల ఆవరణలో జిల్లాలో వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది జిల్లాలో ఎస్పీ విద్యార్థులు 2,800 మంది, బీసీ విద్యార్థులు 32,000 మంది ఉన్నారని, ఈ ఏడాది కొత్తగా కళాశాలల్లో జాయిన్ అవుతున్న విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. డైట్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.వైకుంఠరావు, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.