
ఓవర్ లోడుతో వెళ్తున్న లారీలను అడ్డగించిన స్పీకర్
అధిక లోడ్‌తో ఉన్న లారీలు
నర్సీపట్నం: ఓవర్ లోడుతో వెళ్తున్న లారీలను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్వయంగా ఆపి పోలీసులకు అప్పగించారు. మంగళవారం స్పీకర్ విశాఖ నుంచి నర్సీపట్నం వస్తుండగా.. మాకవరపాలెం మండలం, రాజుపేట వద్దకు వచ్చే సరికి ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న టిప్పర్లను గమనించారు. లారీలను నిలిపి.. అధిక లోడ్‌కు ఎవరు పర్మిషన్ ఇచ్చారని వాహనదారులను నిలదీశారు. ఆ లారీలను పోలీసు స్టేషన్‌లో పెట్టాలని స్పీకర్ పోలీసులను ఆదేశించారు. స్పీకర్ ఆదేశాలతో ఎస్సై దామోదర్‌నాయుడు ఏడు లారీలను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.