
నష్టభయం
● రైతు సేవా కేంద్రాల్లో నాసిరకమైన విత్తనాలు ● 15 రోజులైనా మొలకెత్తకపోవడంతో అన్నదాతల ఆవేదన ● విత్తనాల్లో పొల్లు, కేళీలు.. సగానికి పైగా వృథా ● ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోతున్న రైతులు
నాసిరకం..
సాక్షి, అనకాపల్లి: ఒకరు కాదు..ఇద్దరు కాదు చాలా మంది రైతులు రైతు సేవా కేంద్రాల్లో వరి విత్తనాలు తీసుకుని వరి నారు నాటకపోవడంతో మోసపోతున్నారు. ప్రభుత్వం వీటిపై శ్రద్ధ చూపించకపోవడంతోనే ఇలా జరుగుతోందంటూ రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ముందుగా రావడంతో అన్నదాతలు ఆనందపడ్డారు. రైతు సేవా కేంద్రాల్లో వరి విత్తనాలు తీసు కుని నారు మడులు సిద్ధం చేశారు. వరి విత్తనాలు వేశారు. అయితే వర్షాలు అనుకూలించినా సరే నాణ్యమైన విత్తనాలు రాకపోవడంతో అవి మొలకలు రాక ఖరీఫ్ కష్టాలు ఆదిలోనే ప్రారంభమయ్యాయి. రైతు సేవా కేంద్రంలో విక్రయించే వరి విత్తనాల్లో మొలక శాతాన్ని పరీక్షించకుండా నేరుగా రైతులకు విక్రయించారు. ఇప్పటికే వర్షాలు సరిగా లేక వరి ఆకుపోతలు ఆలస్యమయ్యాయి. ఇపుడు నాసిరకం వరి విత్తనాల కారణంగా వరినారు నాటకపోవడంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి. రైతుకు నాసిరకం విత్తనాలు సరఫరా చేసిన వారిపై వ్యవసాయ శాఖ అధికారులు చర్య లు తీసుకోవాలని రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వంలో అగ్రి ల్యాబ్స్ నిర్వీర్యం
విత్తనం మంచిదైతే పంట బావుంటుంది. పంట బావుంటే దిగుబడిపై దిగులుండదు. ఆశించిన దిగుబడులు సాధించాలంటే మేలి రకం విత్తనం కావాలి. అన్నదాతలు నకిలీ విత్తనాలతో మోసపోకుండా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అగ్రి ల్యాబ్స్‌ను తీసుకొచ్చింది. నాసిరకం, పొల్లు, కేళీ లేకుండా విత్తనాలు అగ్రిల్యాబ్‌లో పరీక్షించి నాణ్యమైన విత్తనాలను ఆర్‌బీకేల ద్వారా పంపిణీ చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వైఎస్సార్ అగ్రి ల్యాబ్‌లను నిర్వీర్యం చేసింది. దీంతో రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని రైతు సంఘాల నాయకులు వాపోతున్నారు.
జిల్లాలో విత్తనాల వివరాలు ఇలా..
అందులో వరి విత్తనాలు 22 వేల క్వింటాళ్లు
ఇప్పటి వరకు పంపిణీ చేసినవి సుమారు 16.5 వేలు
సిద్ధం చేసిన మొత్తం విత్తనాలు 23 వేల క్వింటాళ్లు