
వినియోగదారుల పిల్లల కోటాలో 93 సీట్లు భర్తీ
● ఆర్‌ఈసీఎస్ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ ● ఇంకా మిగిలి ఉన్న సీట్లు 27
కశింకోటలోని ఆర్‌ఈసీఎస్ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్
కశింకోట: ఆర్‌ఈసీఎస్ ప్రధాన కార్యాలయంలో ఉన్న రాజీవ్‌గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యుత్ వినియోగదారుల పిల్లల కోటా కింద 50 శాతం సీట్ల భర్తీకి మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. 93 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 27 సీట్లు మిగిలాయి. అనకాపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఐ.వి.ఎస్.ఎస్.శ్రీనివాసరావు, జనరల్ సెక్షన్ విభాగాధిపతి కె.గోవిందరావు, కెమిస్ట్రీ సీనియర్ లెక్చరల్ శ్రీనివాసరావు అడ్మిషన్ అధికారులుగా హాజరై కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించారు. కళాశాలలో నాలుగు బ్రాంచ్‌లుండగా ఎలక్ట్రానిక్స్, ఎలక్టికల్ బ్రాంచ్‌లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. సివిల్ బ్రాంచ్‌లో అధికంగా 20 సీట్లు, మెకానికల్ బ్రాంచ్‌లో 7 సీట్లు మిగిలాయి. ఈ సీట్లను ఆగస్టు 2వ తేదీలోగా భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ బి.ఉమాశంకర్ తెలిపారు. ర్యాంకు లేని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదన్నారు. వార్షిక ఫీజులు వారే చెల్లించుకోవలసి ఉంటుందన్నారు. కార్యక్రమంలో అసోసియేట్ ప్రిన్సిపాల్ శివ, జనరల్ విభాగాధిపతి గణేష్ తదితరులు పాల్గొన్నారు.