
ఖరీఫ్ సాగుకు రైవాడ నీరు విడుదల
దేవరాపల్లి: ఖరీఫ్ పంటల కోసం రైవాడ జలాశయం నుంచి సాగునీటిని మాడుగుల, చోడవరం ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కె.ఎస్.ఎన్.ఎస్. రాజు మంగళవారం విడుదల చేశారు. ముందుగా రైవాడ అతిథి గృహం వద్ద వినాయకుడికి, జలాశయం వద్ద ఎరకాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జలాశయం వద్ద వేదమంత్రాల నడుమ పూజలు, గంగా హారతి అనంతరం నీటిని విడుదల చేశారు. ఈ మేరకు ఎడమ ప్రధాన కాలువ నుంచి 100 క్యూసెక్కులు, కుడి ప్రధాన కాలువ నుంచి 50 క్యూసెక్కుల నీటిని విడిచి పెట్టారు. కార్యక్రమంలో రైవాడ జలాశయం చైర్మన్ పోతల పాత్రునాయుడు, పైలా ప్రసాదరావు, ఇరిగేషన్ ఈఈ త్రినాథం, డీఈఈ జి. సత్యంనాయుడు, తహసీల్దార్ పి.లక్ష్మీదేవి, నీటి సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.