
వెల్‌నెస్ కేంద్రం బిల్లు నిలిపివేశారు..
గత ప్రభుత్వం మంజూరు చేసిన వెల్‌నెస్ కేంద్రం నిర్మాణం పూర్తి చేసి ఏడాది పూర్తయిందని, ఎన్నికల అనంతరం మంజూరైన పెండింగ్ బిల్లు రూ.7,50,314లు చెల్లించకుండా టీడీపీ నేత గండి బాబ్జీ నిలిపేశారని సబ్బవరం మండలం మొగలిపురం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ యడ్ల నాయుడు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఏడాది కాలంగా కలెక్టర్, జేసీ, జిల్లా పంచాయతీ అధికారి, ఇంజినీరింగ్ అధికారులకు అనేక వినతులు ఇచ్చినా పట్టించుకోవడం లేదంటూ నిరసనకు సిద్ధమవ్వగా సిబ్బంది బయటకు ఈడ్చుకెళ్లారని, తనకు బిల్లు వెంటనే చెల్లించాలంటూ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సర్పంచ్ పదవికి గండి బాబ్జీ భార్యపై పోటీ చేయడంతో కక్ష కట్టి కావాలనే బిల్లు నిలిపివేశారని, సర్పంచ్‌పై, గండి బాబ్జీపై చర్యలు తీసుకోవాలని కోరారు.