
కలెక్టర్ కరుణించాలి..
పుట్టుకతోనే 90 శాతం వైకల్యం కలిగి అనేక ఇబ్బందులతో పోషించుకుంటున్న బిడ్డకు రూ.15 వేల ప్రభుత్వ పించన్ మంజూరు చేయాలని ఏడాది కాలంగా తిరుగుతున్నా అధికారులు జాలి చూపడం లేదని మునగపాక మండలం నాగులాపల్లికి చెందిన బాలుడు పొట్ల తులసీరావు తల్లిదండ్రులు అప్పారావు దంపతులు ఆవేదన చెందారు. వ్యయప్రయాసలతో ఇంటి నుంచి బిడ్డను మోసుకొస్తున్నా కనికరించడం లేదన్నారు. ఏడాది కాలంలో మూడుసార్లు కలెక్టరేట్‌కు వచ్చామని, కలెక్టర్ వద్దకు నేరుగా వెళ్లనివ్వకుండా కింద నుంచే పంపించేస్తున్నారని వాపోయారు. కలెక్టర్‌కు బిడ్డ తండ్రి అప్పారావు అర్జీ అందించారు. మానసిక వైకల్యం ఉన్నట్టు సర్టిఫికెట్‌లో ఉన్నందున 15 వేల పింఛన్ రాదని చెబుతున్నారని, తమ బిడ్డ దయనీయ స్థితిని చూసైనా కలెక్టర్ కరుణించాలని వారు వేడుకుంటున్నారు.