
కలెక్టరేట్‌లో పొమ్మంటే నా బాధ ఎవ్వరికీ చెప్పుకోవాలి
బయోమెట్రిక్‌లో వేలిముద్రలు పడటం లేదని ఆధార్ కార్డు ఇవ్వడం లేదు. కలెక్టరేట్‌కు వస్తే ఆధార్ కార్డు లేనిదే పీజీఆర్‌ఎస్‌లో అర్జీ నమోదు కుదరదంటూ సిబ్బంది పొమ్మంటున్నారు. నా బాధ ఇంకెవ్వరికీ చెప్పుకోవాలని పాయకరావుపేట మండలం పెదరామభద్రపురం గ్రామానికి చెందిన దివ్యాంగురాలు పోలిన వెంకటలక్ష్మి తిరుగుముఖం పట్టింది. దివ్యాంగురాలైన ఆమెను కుటుంబ సభ్యులు వదిలేయడంతో ఒంటరిగా జీవిస్తోంది. గతంలో పింఛన్ వచ్చేదని, ఆధార్ కార్డు లేకపోవడంతో నిలిపివేసారని ఆమెతో వచ్చిన తోటి మహిళ తెలిపింది. ఆధార్ కార్డు మంజూరు చేస్తే ప్రభుత్వ పథకాలతో భరోసా దొరుకుతుందని ఆశతో వచ్చామని చెప్పింది.