
అంగన్‌వాడీ నియామకాల్లో అవినీతి
అంగన్‌వాడీ నియామకాల్లో ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ సోదరుల అవినీతిపై విచారణ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం నాయకులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటలో ఎస్సీ రిజర్వేషన్‌లో వచ్చిన అంగన్‌వాడీ పోస్టుకు మంత్రి సునీత అర్హురాలైనా ఎంపిక చేయలేదన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇంటర్వ్యూ ప్యానల్ అవినీతికి పాల్పడి ఆమెకు అన్యాయం చేసిందన్నారు. తక్షణమే విచారణ చేపట్టి అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యే, అధికారులపై చర్యలు తీసుకోవాలని విదసం నాయకులు డాక్టర్ బూసి వెంకటరావు, బాజి ఒంకార్, గుడివాడ ప్రసాద్, బూల భాస్కరరావు కోరారు.