
ఆరోగ్యం కోసం నిత్య వ్యాయామం
● అంతర్జాతీయ బాడీ బిల్డర్, టీమ్ ఇండియా కోచ్ శివశంకర్
అనకాపల్లి:
యువత చెడుమార్గాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యంగా కోసం నిత్యం వ్యాయామం చేయాలని అంతర్జాతీయ బాడీ బిల్డర్, టీమ్ ఇండియా కోచ్ టి.శివశంకర్ తెలిపారు. స్థానిక రింగ్‌రోడ్డు డాక్టర్ హిమశేఖర్ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్లో అనకాపల్లి బాడీ బిల్డర్స్ అండ్ ఫిట్‌నెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువతకు బాడీ బిల్డింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు ద్వారా ఆరోగ్యంగా జీవించడమే కాకుండా శరీర ఆకృతిని పెంచుకోవచ్చన్నారు. అసోసియేషన్ కార్యదర్శి శిలపరశెట్టి బాబీ మాట్లాడుతూ యువత మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తూ జిమ్‌కు వెళ్లాలన్నారు. బాడీ బిల్డింగ్ క్రీడ వల్ల మనం ఫిట్‌గా ఉండటమే కాకుండా సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. ఒలింపిక్ వెయిట్ లిఫ్టర్ మళ్ల వెంకట మాణిక్యాలు మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తే విద్యతోపాటు క్రీడల్లోనూ ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చన్నారు. జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరపల్లి కృష్ణాజీ, విశాఖ జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజారావు, అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ దండా కుసుమలు మాట్లాడుతూ క్రీడలతో ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. అనంతరం శివశంకర్‌ను అసోసియేషన్ సభ్యులు శాలువాతో సత్కరించారు.
కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీధర్, ఎన్‌సీసీ అధికారి ధర్మలింగం అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు శ్రీను, చిన్న, ప్రసాద్, నరేంద్ర, తులసి, విద్యార్థులు పాల్గొన్నారు.