
జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పతకాల పంట
చోడవరం : జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో ఉమ్మడి విశాఖ జిల్లా క్రీడాకారులు పతకాల పంట పండించారు. ఈనెల 25 నుంచి 28 వ తేదీ వరకూ విజయవాడలో 10వ ఓపెన్ జాతీయ స్థాయి తైక్వాండో క్యోరుగి, ఫూమ్‌సే పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 12 మంది క్రీడాకారులు బంగారు పతకాలు, ఆరుగురు రజత పతకాలు, 13మంది కాంస్య పతకాలు సాధించారు. చోడవరం, ఆరిలోవ ప్రాంతాలకు చెందిన చుక్కల లాస్య, ఎం.రవిచంద్ర, కొల్లిపార తన్విత్ ఉదయ్, గండి కారుణ్య సందీప్, ఎ.ధనుష్, బి.రాఘవ, డి.దక్షితరెడ్డి, డి.రుద్రాక్షరెడ్డి బంగారు పతకాలు సాధించారు. వీరిలో కొల్లిపార తన్విత్ ఉదయ్ 3, గండి కారుణ్యసందీప్ 2 బంగారు పతకాలు వివిధ విభాగాల్లో సాధించారు. ఎం.శరణ్య, జి.వి.శశివర్థన్‌కుమార్, ఎన్. రిషితాంజలి, బి.పర్నిక అరోహి, ఎన్. కేశవర్థన్, వి.ఇషితశారద, షేక్ సభీన ఆజ్మి, జి. భరద్వాజ్, బి.కార్తీక్, జి. జాహ్నవి జయశ్రీ రజతం, కాంస్య పతకాలు సాధించినట్టు ఏపీ తైక్వాండో అసోసియేషన్ విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు, కోచ్ పల్లం మురళి తెలిపారు. పతకాలు సాధించిన విజేతకు అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు.

జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పతకాల పంట