
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
పాయకరావుపేట : ఈ నెల 25 నుండి 27 వరకు వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్, కరీంనగర్ తెలంగాణాలో జరిగిన సీబీఎస్‌ఈ క్లసర్ – 7 కబడ్డీ పోటీల్లో అండర్ – 14, అండర్ – 19 విభాగాల్లో శ్రీ ప్రకాష్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించి, ఒక్కో జట్టు రూ.10 వేలు నగదు బహుమతిని పొందడమే కాకుండా సెప్టెంబరు 13 నుండి 16 వరకు నారాయణ వరల్డ్ స్కూల్, జముహార్, బీహార్‌లో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనడానికి అర్హత సాధించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా సీబీఎస్‌ఈ క్లస్టర్ –7 కబడ్డీ పోటీల్లో అండర్ –19 విభాగంలో శ్రీ ప్రకాష్ విద్యార్థులు బంగారు పతకాలు సాధించి ప్రథమ స్థానంలో నిలుస్తున్నారని తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యా అధినేత సిహెచ్.వి.కె. నరసింహారావు, సీనియర్ ప్రిన్సిపాల్ ఎం.వి.వి.ఎస్ మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ ఎం.అపర్ణ, కోచ్ లక్ష్మణ్, చినరాజు అభినందించారు.