
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపిక
● జిల్లా స్థాయిలో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు చోడవరం క్రీడాకారుల ఎంపిక
చోడవరం :
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు చోడవరం క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇటీవల పరవాడ మండలంలో జరిగిన జిల్లా స్థాయి యోగాసనాల పోటీల్లో చోడవరానికి చెందిన ఒమ్మి శ్యామ్‌ప్రసాద్ యాదవ్, గొంతిన లయవర్థన్, పందిరి వెన్నెశ్రీ, మళ్ల శ్రీహిత, పుల్లేటి సతీష్ బంగారు పతకాలు సాధించారు.
వీరు ఆగస్టు నెలలో కాకినాడలో జరగనున్న రాష్ట్రస్థాయి యోగాసనాల పోటీల్లో అనకాపల్లి జిల్లా నుంచి పాల్గొనేందుకు ఎంపికై నట్టు యోగా గురువు పుల్లేటి సతీష్ చెప్పారు. పతకాలు సాధించిన క్రీడాకారులను చోడవరం పతంజలి యోగా కేంద్రం ప్రతినిధులు అభినందించారు.