తాండవలో జాడ లేని చేపపిల్లల ఉత్పత్తి | - | Sakshi
Sakshi News home page

తాండవలో జాడ లేని చేపపిల్లల ఉత్పత్తి

Jul 28 2025 8:21 AM | Updated on Jul 28 2025 8:21 AM

తాండవ

తాండవలో జాడ లేని చేపపిల్లల ఉత్పత్తి

కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం

తాండవ చేప పిల్లలు ఉత్పత్తి కేంద్రంలో చేప పిల్లల ఉత్పత్తి గత ఏడాది జరగలేదు. ఈఏడాది నేటి వరకు అక్కడ ఏమీ కన్పించలేదు. కేవలం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈవిధంగా జరుగుతుంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన పిల్లలు జిల్లా అంతంటా గతంలో సరఫరా చేసేవారు,. ప్రస్తుతం మనం ఇతర ప్రాంతాల్లో కొనుక్కునే పరిస్థితి వచ్చింది.

– సాగిన లక్ష్మణమూర్తి, ఎంపీపీ

నాతవరం: ఉమ్మడి జిల్లాలోనే ఏకై క చేప పిల్లలు ఉత్పత్తి కేంద్రం తాండవలో ఈఏడాది చేప పిల్లలు ఉత్పత్తి జాడ కన్పించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా మత్స్యశాఖ ఆధ్వర్యంలో జూన్‌ నుంచి ఆగస్టు మూడు నెలల పాటు తాండవ ఉత్పత్తి కేంద్రంలో కోటి 50లక్షల వరకు ఉత్పత్తి చేయడం జరిగేది. ఈ కేంద్రంలో పెద్ద చేపలకు ఇంజక్షన్లు చేసి కృత్రిమ గర్భోఉత్పత్తి ద్వారా వివిధ జాతుల చేప పిల్లలు కోటిన్నరకు పైగా ఉత్పత్తి చేసేవారు. వాటిని తాండవ రిజర్వాయరులో విడుదల చేసేవారు. తర్వాత జిల్లాలో కోనాం, రైవాడ, రవాణాపల్లి, కళ్యాణపులోవ తదితర రిజర్వాయర్లకు చేప పిల్లలు సరఫరా చేసేవారు. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు కలిగి ఉన్న మత్స్య సహకార సంఘాలకు రాయితీపై సరఫరా చేసే వారు. మిగిలిన చేప పిల్లలను నర్సీపట్నంలో గల మత్స్యకార కార్యాలయం ప్రాంగణంలో గల నీటి కుండీలలో నిల్వ చేసేవారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేటు వ్యక్తులకు చెరువులో పెంచుకునేందుకు చేప పిల్లలను విక్రయించేవారు. అంతటి ప్రాముఖ్యం కలిగిన తాండవ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సిబ్బంది కొరత లేదా నిధుల సమస్య అనేది తెలియరాలేదు.

మండలంలో తాండవలో 1986లో చేప పిల్ల లు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా జూన్‌, జూలై, ఆగస్టు నెలలో ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని అధిగమించి చేప పిల్లల ఉత్పత్తి చేసేవారు. గత ఏడాది ఈ కేంద్రంలో చేప పిల్లల ఉత్పత్తి జరగలేదు. దీంతో ఇతర జిల్లాలో 25 లక్షలు చేప పిల్లలు కొనుగోలు చేసి వాటిని కలెక్టరు విజయకృ్‌ష్ణన్‌చేతుల మీదుగా తాండవ రిజర్వాయరులో విడుదల చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తాండవ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం భవనం శిథి లావస్థకు చేరింది. నీటి కోసం ఏర్పాటు చేసిన బోరు వాడకపోవడంతో పిచ్చి మొక్కల మధ్యలో నిరుపయోగంగా దర్శినమిస్తోంది. సిబ్బంది అప్పుడప్పుడు మాత్రమే కార్యాలయాన్ని సందర్శించడంతో తలుపులు, కిటికీలు చెదలు పట్టి శిథిలమవుతున్నాయి.

తాండవలో తగ్గిన చేపల వేట

గతంతో పోల్చుకుంటే తాండవ రిజర్వాయరులో చేపలు వేట గణనీయంగా తగ్గిందని మత్స్యకారులు అంటున్నారు. తాండవ రిజర్వాయరులో చేపల వేటపై ఆధారపడి నాతవరం, గొలుగొండ, కొయ్యూరు మండలాలకు చెందిన 600 నుంచి 700 మధ్య కుటుంబాలకు పైగా మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. జాలారిపేట, అమ్మపేట, జోగుంపేట, పొగచెట్లపాలెం, సారిక మల్లవరం, ఆడాకుల అమ్మపేట, చోద్యం, తాండవ తదితర గ్రామాల్లో మత్స్యకారులు ఉన్నారు. వారంతా ప్రతి రోజు తాండవ రిజర్వాయరులో చేపలు వేటాడి జీవనం సాగిస్తుంటారు. గతంలో 5 నుంచి 25 కేజీల వరకు పెద్ద చేపలు పడేవి. ఇటీవల కాలంలో తాండవలో మచ్చుకై నా పెద్ద చేపల జాడ కన్పించడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తాండవలో చిన్న చేపలు మాత్రమే దొరకడంతో వాటిని స్థానికంగా విక్రయిస్తున్నారు. గతంలో వలే చేపల వేట సాగకపోవడంతో మత్స్యకారులు నాగార్జున సాగర్‌ వంటి ప్రాంతాలకు వలసపోయారని చెబుతున్నారు. ఈ విషయంపై నర్సీపట్నం మత్స్యకార అధికారి నాగమణిని వివరణ కోరగా తాండవ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంపై దృష్టి సారించామన్నారు. తాండవ ప్రాజక్టు నుంచి నీరు కావాలని జేఈని అడిగామని త్వరలోనే చేప పిల్లలు ఉత్పత్తి చేస్తామన్నారు.

గతంలో ఏటా కోటి 50 లక్షల చేప పిల్లల ఉత్పత్తి

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సరఫరా

నేడు శిథిలావస్థలో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం

పట్టించుకోని కూటమి ప్రభుత్వం

తాండవలో జాడ లేని చేపపిల్లల ఉత్పత్తి1
1/2

తాండవలో జాడ లేని చేపపిల్లల ఉత్పత్తి

తాండవలో జాడ లేని చేపపిల్లల ఉత్పత్తి2
2/2

తాండవలో జాడ లేని చేపపిల్లల ఉత్పత్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement