
జిల్లా హెచ్‌ఎంల సంఘం నూతన కార్యవర్గం
అనకాపల్లి : జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షునిగా ఎ.వి.హెచ్.శాస్త్రి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక గవరపాలెం గౌరీ గ్రంథాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో సంఘం ప్రధాన కార్యదర్శిగా ఆళ్ల శేఖర్, కోశాధికారిగా నాగేంద్ర, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎం.ఎస్.ప్రసాద్, కె.ఆర్.ఎస్.నాయుడు, ఎ.వరహామూర్తి ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకుడిగా సంఘం రాష్ట్ర కోశాధికారి సి.వి.వి.సత్యనారాయణ వ్యవహరించారు. పై కమిటీ ఎన్నిక రెండు సంవత్సరాలు ఉంటుందని ఎన్నికల అధికారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉప విద్యాశాఖ అధికారి పొన్నాడ అప్పారావు, పరీక్షల విభాగం సహాయ కమిషనర్ పి.శ్రీధర్‌రెడ్డి, జిల్లా కామన్ పరీక్షల బోర్డు చైర్మన్‌లు సిహెచ్.సత్యనారాయణ, సాయిబాబా పాల్గొన్నారు. అనంతరం 2024 జనవరి నుంచి ఈ ఏడాది జూన్ వరకూ 30 మంది హెచ్‌ఎంలు పదవీ విరమణ చేసిన హెచ్‌ఎంలను సంఘం సభ్యులు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు పాల్గొన్నారు.