
దళిత రైతుల నిరాహార దీక్ష
● ఆర్డీవో కార్యాలయం వద్ద వంటావార్పు కార్యక్రమం
నర్సీపట్నం: మాకవరపాలెం మండలం జి.కోడూరులోని సర్వే నంబర్ 332లో క్వారీని వెంటనే మూసి చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా బహుజన పార్టీ రాష్ట్ర నాయకుడు బొట్టా నాగరాజు ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద శనివారం 4వ రోజు నిరాహార దీక్ష కార్యక్రమం కొనసాగింది.ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ నాలుగు రోజులు నుంచి దళితలు నిరాహార దీక్షలు చేస్తున్నా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు.మైనింగ్ మాఫీయా కారణంగా దళిత రైతులకు జీవనాధారమైన భూముల్లో దుమ్మధూళి రావడం వల్ల పంటలు నాశనం అవుతున్నట్లు ఆరోపించారు. ఇప్పటికే అనేకమార్లు అధికారులు దృష్టికి తీసుకువచ్చినా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఈవిషయంలో అధికారులు స్పందన చూసి సోమవారం ఆర్డీవో కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఉద్యమం చేయనున్నట్టు చెప్పారు. దీక్షా శిబిరం వద్ద శనివారం వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు చిరంజీవి,మల్లేస్,అప్పారావు, లోవరాజు , పెంటయ్య, సతీష్ తదితర్లు పాల్గొన్నారు.