
సంక్షోభ హాస్టళ్లు
● సమస్యలకు నిలయాలుగా సంక్షేమ హాస్టళ్లు ● గురుకుల, కేజీబీవీ,మోడల్,బీసీ, ఎస్సీ,ఎస్టీ వసతిగృహాల్లో కనీస సౌకర్యాలు కరువు ● శిథిలమైన భవనంలో, పెచ్చులూడిన గదుల్లోనే వసతి గృహాల నిర్వహణ ● తలుపులు లేని బాత్ రూంలు,మరుగుదొడ్లతో ఇక్కట్లు
6
12
6
9
30
39
10
14
22
32
8
24
ఈ చిత్రంలో కనిపిస్తున్నది నర్సీపట్నం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ బాలికల వసతిగృహం. ఈ హాస్టల్‌లో సౌకర్యాలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పందించింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో గత ఏడాది అక్టోబర్‌లో మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి పి.షియాజ్ ఖాన్ నియోజకవర్గంలోని పలు వసతిగృహాలను పరిశీలించారు. అప్పుడు నర్సీపట్నం ఎస్సీ బాలికల వసతి గృహంలో మరుగుదొడ్లు సౌకర్యం లేని విషయాన్ని గమనించారు. అప్పటికి ఒక్క మరుగుదొడ్డి మాత్రమే నిర్వహణలో ఉంది. ఇదే విషయం ఆయన ఉన్నత న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. అప్పట్లో ఈ విషయంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సీరియస్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని మిగతా వసతిగృహాలతో పాటు ఇక్కడ వసతిగృహంలో సమస్యలపై తీసుకోబోయే చర్యలు గురించి సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి స్వయంగా వివరణ ఇచ్చారు. అయితే ఇదొక్కటే కాకుండా జిల్లా వ్యాప్తంగా వసతి గృహాలను అధికార్లు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే చాలా సమస్యలు బయట పడతాయి. కనీస సదుపాయాలు లేక వసతి గృహాల్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వెలుగులోకి వస్తాయి.
సాక్షి,అనకాపల్లి/నర్సీపట్నం/నక్కపల్లి/పాయకరావుపేట/మాడుగుల/మాడుగుల రూరల్/కోటవురట్ల/గొలుగొండ :
శిథిలమైన భవనాలు..చాలీచాలని గదులు..తిరగని ఫ్యాన్‌లు..విరిగిన తలుపులు..పెచ్చులూడిన శ్లాబులు..పూర్తిస్థాయిలో మెయింట్‌నెన్స్‌లేని మరుగుదొడ్లు..తాగునీటికీ తప్పని ఇబ్బందులు..ఇలా ఒకటి కాదు రెండు కాదు జిల్లాలో గల హాస్టళ్లలో సమస్యల జాబితా ఏకంగా చాంతాడంత ఉంది. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు నరకయాతన పడుతున్నారు. ‘సాక్షి’ నిర్వహించిన క్షేత్రస్థాయి విజిట్‌లో విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం, అశ్రద్ధ అడుగడుగునా స్పష్టంగా కనిపించింది.
జిల్లాలో మొత్తం 97 వసతి గృహాలున్నాయి. ఏ సంక్షేమ హాస్టల్‌ను చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు దర్శనమిస్తున్నాయి. అరకొర వసతి, గాడి తప్పిన నిర్వహణతో దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. రాత్రి వేళలో దోమల బెడద ఎక్కువగా ఉంది. దోమల తెరలు లేవు..కనీసం దుప్పట్లు సైతం సరఫరా చేయని దుస్థితి కనిపించింది. కొన్ని హాస్టళ్ల బాత్ రూంలు, మరుదుదొడ్లకు తలుపులు లేకపోవడంతో చిన్నారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మినరల్ ప్లాంట్లు మరమ్మతులకు గురవడంతో విద్యార్థులు మోటార్‌నీళ్లే తాగుతున్నారు. మరుగుదొడ్ల పరిస్థితి మరీ ఘోరం ఉంది. రన్నింగ్ వాటర్ సదుపాయం లేకపోవడంతో వారి అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది.
నర్సీపట్నంలో..
నర్సీపట్నం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ బాలికల వసతిగృహంలో విద్యార్థినుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా వసతులు పెరగలేదు. దాదాపు ఐదు దశబ్దాల క్రితం ఈ వసతిగృహాన్ని నిర్మించారు. 120 మంది విద్యార్థినులు ఉండేందుకు వీలుగా ఈ భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం 228 మంది విద్యార్థినులు ఇక్కడ ఉంటున్నారు. వీరిలో ఉన్నత పాఠశాల విద్యార్థినులు 170 మంది కాగా, 58 మంది ఇంటర్, డిగ్రీ విద్యార్థినులు. కాలేజీ విద్యార్థినుల వసతిగృహం ప్రత్యేకంగా నిర్వహించాల్సి ఉంది. సర్దుబాటు పేరుతో కాలేజీ విద్యార్థినులకు కూడా ఇక్కడే వసతి కల్పిస్తున్నారు. వసతి గృహంలో పది మరుగుదొడ్లు, పది స్నానాల గదులు ఉన్నాయి. పరిమితమైన వీటిలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. ఇటీవలే వీటిన్నింటికి మరమ్మతులు పూర్తి చేశారు. అయినప్పటికీ మూడు మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో వినియోగించడం లేదు. వసతిగృహం మొత్తం మీద నివాస గదులు ఏడు ఉన్నాయి. ఒక్కో గదిలో 10 నుంచి 15 మంది ఉండాల్సి ఉండగా 30 మంది వరకు ఉంటున్నారు.
●గొలుగొండ మండలంలో ఏపీ బాలయోగి గురుకుల కళాశాల వసతి గృహంలో డార్మెటరీ మరమ్మతులకు గురికావవంతో ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు. మొత్తం 390 మంది విద్యార్థులున్నారు.
పాయకరావుపేట నియోజకవర్గంలో...
పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో గోడిచర్ల బీసీ హాస్టల్లో 64 మంది విద్యార్థులు ఉన్నారు. శిథిలావస్థకు చేరిన ఈ హాస్టల్ భవనం కూల డానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడు కూలిపోతుందోనన్న భయంతో విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. నిర్మించిన 11 ఏళ్లకే శిథిలావస్థకు చేరుకుంది. మరుగుదొడ్లు తలుపులు ఊడిపోయాయి. మంచాలు లేకపోవడంతో విద్యార్థులు కటిక నేల మీద పడుకోవలసి దుస్థితి ఉంది. గదుల్లో ఫ్యాన్‌లు సరిగ్గా తిరగడం లేదు. హాస్టల్ ఆవరణ అంతా అధ్వానంగా ఉంది. ప్రహారీ , తాగు నీటి సదుపాయం లేవు ప్రస్తుతం కోటవురట్ల హాస్టల్ వార్డెన్ ను 10 రోజుల క్రితం ఇంచార్జ్ గా నియమించారు.
●పాయకరావుపేటలో బీసీ బాయ్స్ కళాశాల హాస్టల్లో 71 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా నేల మీద పడుకుంటున్నారు. ఎస్సీ బాయ్స్ హాస్టల్లో 58 మంది విద్యార్థులున్నారు. వీరి పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
●కోటవురట్ల మండలంలో గల సమగ్ర బాలుర వసతి గృహంలో విద్యార్థులకు మంచాలు అందుబాటులో లేవు. నేలపైనే దుప్పట్లు వేసుకుని పడుకుంటున్నారు. టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయి. కిటికీల డోర్లు చెదపట్టి దారుణంగా ఉన్నాయి. బాత్ రూంలకు తలుపులు సరిగ్గా లేవు.
మాడుగుల నియోజకవర్గంలో
●మాడుగుల బీసీ జూనియర్ డిగ్రీ బాలికల వసతి గృహం అద్దె ఇంటిలో కొనసాగుతోంది. ఇక్కడ ఉంటున్న సుమారు 75 మంది విద్యార్థినులు ఇరుకు గదుల్లో ఇక్కట్లకుగురవుతూ సర్దుకోవలసి వస్తోంది.
●అద్దె ఇంటిలో నిర్వహిస్తున్న మాడుగుల జూనియర్, డిగ్రీ కళాశాల ఎస్టీ బాలికలు వసతి గృహంలో కనీస వసతులు లేవు. ఇక్కడ వందమంది విద్యార్థినులు వసతి పొందుతున్నారు. కేవలం మూడు మరుదుదొడ్లు మాత్రమే ఉండగా వాటిలో ఒకటి శిథిలమైపోయింది. మిగిలిన రెండు మరుగుదొడ్లకు తలుపులు సక్రమంగా లేవు.
మరుగుదొడ్లు సరిపడక ఇక్కడ విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు భోజనశాల వద్ద బురద మయంగా మారుతుండడంతో విద్యార్థినులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.
మాడుగులలో బీసీ బాలుర వసతి గృహం భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు భయంగాభయంగా ఉంటున్నారు.ఇక్కడ 6 నుంచి 10 వ తరగతికి చెందిన 50 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. దుప్పట్లు, రగ్గులు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.
చోడవరం నియోజకవర్గంలో
చోడవరం: మండలంలో గాంధీగ్రామంలో ఎస్సీ బాలుర వసతిగృహానికి, చోడవరం ఎస్సీ గర్ల్స్ కాలేజీ హాస్టల్ భవనాలకు మరమ్మతు పనులు కొంతమేర చేశారు. గోవాడ బీసీ బాలుర హాస్టల్‌ను ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్నారు. తగిన సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. చోడవరం ఎస్టీ కాలేజీ బాలికల హాస్టల్‌కు సొంత భవనం లేకపోవడంతో అద్దెభవనంలో నిర్వహిస్తున్నారు. చోడవరం, రావికమతం, బుచ్చెయ్యపేట మండలాల్లో ఉన్న బీసీ హాస్టల్ విద్యార్థులకు ఈ ఏడాది ఇంకా రగ్గులు సరఫరా చేయలేదు. వడ్డాది ఎస్సీ బాలుర హాస్టల్‌లో వాటర్ ఫిల్టర్, ఇన్వర్టర్ లేదు. దీనివల్ల కరెంటు లేని సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రోలుగుంట బీసీ హాస్టల్ ఆవరణంలో మురికి నీరు నిల్వ ఉండి పోతోంది. భవనం కూడా పాతదికావడంతో కొద్దిపాటి వర్షానికే కొన్ని గదుల్లోని నీరు కారిపోతోంది.
●కశింకోటలోని వసతి గృహాల్లో సరైన సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన బీసీ బాలుర హాస్టల్ విద్యార్థులకు మంచాలు లేక కటిక నేల మీద నిద్రించాల్సిన పరిస్థితిని ఉంది. వీరికి బెడ్ షీట్లు కూడా ఇవ్వడం లేదు. దీంతో ఇంటి వద్ద నుంచి తెచ్చుకుంటున్నారు. పది మరుగుదొడ్లు వినియోగంలో ఉండగా మరో నాలుగు నిరూపయోగంగా ఉన్నాయి. బాత్‌రూమ్‌లు లేకపోవడంతో ఆరు బయట స్నానాలు చేస్తున్నారు. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసినప్పటికి అవి చాలా కాలంగా పని చేయడం లేదు.
బీసీ వెల్ఫేర్ కళాశాల వసతి గృహాలు
ప్రీమెట్రిక్ బీసీ వెల్ఫేర్ వసతి గృహాలు
వీటిలో
బాలురు
బాలికలు
జిల్లాలో వసతి గృహాలు వివరాలు ఇలా..
ఈ రెండింటిలో బాలురు
బాలికల వసతి గృహాలు
వీటిలో ప్రీమెట్రిక్ హాస్టళ్లు
ఎస్సీ వెల్ఫేర్ వసతి గృహాలు
కేజీబీవీలు
పోస్టు మెట్రిక్

సంక్షోభ హాస్టళ్లు

సంక్షోభ హాస్టళ్లు

సంక్షోభ హాస్టళ్లు

సంక్షోభ హాస్టళ్లు

సంక్షోభ హాస్టళ్లు

సంక్షోభ హాస్టళ్లు

సంక్షోభ హాస్టళ్లు

సంక్షోభ హాస్టళ్లు

సంక్షోభ హాస్టళ్లు