
ప్లాస్టిక్ వినియోగంతో అనర్థాలు
● కలెక్టర్ విజయ కృష్ణన్
చెత్త సేకరణ రిక్షాలు పంపిణీ చేస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే సుందరపు
అచ్యుతాపురం: ప్లాస్టిక్ వినియోగంతో ఎన్నో అనర్థాలు సంభవిస్తున్నాయని, అందువల్ల ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించడానికి అందరూ కృషి చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అచ్యుతాపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద శనివారం జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. చెత్త సేకరణకు 40 మూడు చక్రాల రిక్షాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఘన వ్యర్థాల నిర్వహణ అత్యంత కీలకమన్నారు. అందరూ వస్త్ర సంచులను వినియోగించాలని సూచించారు. తద్వారా సింగిల్ యాజ్డ్ పాలిథిన్ కవర్ల వినియోగాన్ని నివారించవచ్చని తెలిపారు.కోహెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సౌజన్యంతో ఈ రిక్షాలను ఆయా గ్రామాలకు సమకూర్చారు.ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఎం.జగన్నాథపురం వంటి కొండవాలు ప్రాంతాల్లో చెత్తసేకరణకు ఎలక్ట్రానిక్ ఆటోలు అవసరముంటుందన్నారు.