
ఈవీఎం గోదాముల వద్ద అప్రమత్తత అవసరం
రాజకీయ పార్టీల నేతలతో కలిసి ఈవీఎం గోదాములను తనిఖీ చేస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: ఈవీఎం గోదాముల వద్ద సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. నెలవారీ తనిఖీలో భాగంగా ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోదాములను శుక్రవారం ఉదయం ఆమె డీఆర్‌వో వై.సత్యనారాయణరావు, వివిధ రాజకీయ పార్టీల నేతలతో కలిసి తనిఖీ చేశారు. గోదాముల వద్ద పరిస్థితులతో పాటు సీసీ కెమెరాల పనితీరును, ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను పరిశీలించారు. భద్రతా ప్రమాణాలపై అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. లాగ్ బుక్ నిర్వహణ ఇతర అంశాలపై రాజకీయ పార్టీల నేతలతో కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యకమంలో ఆర్డీవో షేక్ ఆయిషా, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఆర్.వెంకటరమణ, జిల్లా ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ఎస్.ఎస్.వి.నాయుడు, రాజకీయ పార్టీల నేతలు జాజుల రమేష్, బి.శ్రీనివాసరావు, ఉగ్గిన అప్పారావు, కె.వి.మారియో, కె.హరినాథబాబు, ఆర్.శంకరరావు, విద్యుత్ శాఖ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.