
పాటిపల్లిలో పారిశ్రామిక అవసరాల కోసం సర్వే
మాట్లాడుతున్న తహసీల్దార్ సత్యనారాయణ
మునగపాక: పాటిపల్లి పంచాయతీ పరిధిలో పారిశ్రామిక అవసరాల కోసం సర్వే చేపడుతున్నట్లు తహసీల్దార్ పి.సత్యనారాయణ తెలిపారు. సోమవారం పాటిపల్లి సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నెంబర్లు 79, 112, 113లో ఉన్న సుమారు 600 ఎకరాల భూమిని వారం రోజులపాటు సర్వే చేస్తామన్నారు. ఆయా సర్వే నెంబర్ల పరిధిలోని రైతులు తమ పట్టాదారు పుస్తకాలతో అందుబాటులో ఉండాలన్నారు. సర్పంచ్ ఆడారి కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామస్తులు పాల్గొన్నారు.