
నాలుగు రెట్లు పరిహారం చెల్లించాలని సుజల స్రవంతి ప్రాజెక
కలెక్టరేట్ వద్ద నల్లరేగులపాలెం రైతుల నిరసన ప్రదర్శన
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి జాబితాలో తప్పులను సవరణ చేసి, బహిరంగ మార్కెట్ విలువకు నాలుగు రెట్లు అధికంగా నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సబ్బవరం మండలం నల్లరేగులపాలెం గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రైతుల నుంచి సేకరిస్తున్న మెట్ట భూములను పల్లం భూములుగా నమోదు చేశారన్నారు. దాంతో తక్కువ నష్టపరిహారం నమోదైందని, పూర్వ కాలంగా సాగుచేసుకుంటున్న బంజరు భూములకు నష్టపరిహారం మంజూరు చేయాలని డీఆర్వోకు రైతు సంఘం మండల కార్యదర్శి గంటా శ్రీరామ్‌తో పాటు రైతులు వినతిపత్రం అందించారు.