
టీడీపీ నేత నుంచి కాపాడండి
● వేరే చోటుకు బదిలీ చేయాలని హెచ్‌ఎం వేడుకోలు ● ఎంఈవోకు వినతిపత్రం
ఎంఈవో జానుప్రసాద్‌కు వినతి పత్రం
అందజేస్తున్న హెచ్‌ఎం రాము
రోలుగుంట: మండలంలోని అర్ల పంచాయతీలో ఎంపీపీ పాఠశాల హెచ్‌ఎం బోనెల రాముని గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పాడి శ్రీను తరచూ బెదిరిస్తున్నాడు. ఈ నెల 10న పాఠశాలలో పేరెంట్స్, టీచర్ సమావేశంలోనూ అతను రభస చేయడంతో పాటు హెచ్‌ఎం అంతు చూస్తానంటూ బెదిరించిన విషయం విదితమే. ఈమేరకు హెచ్‌ఎం ఈ నెల 12న పోలీసులకు, ఎంఈవోకు ఫిర్యాదు చేశా రు. ఎంఈవో జాను ప్రసాద్ సోమవారం అర్ల పాఠశాలకు వెళ్లి హెచ్‌ఎంను, స్థానికులను విచారణ చేశారు. శ్రీను నుంచి తనకు ప్రాణహాని ఉందని, వెంటనే తనను పాఠశాల మార్పు చేయాలని ఎంఈవోకు విజ్ఞప్తి చేశారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని ఎంఈవో తెలిపారు.