
ఎస్పీ కార్యాలయానికి 40 అర్జీలు
అర్జీదారుల సమస్యలను వింటున్న
ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 40 అర్జీలు వచ్చాయి. అర్జీదారుల నుంచి ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, చీటింగ్ వంటి వాటిపై అర్జీలు వచ్చాయన్నారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయా పోలీసు స్టేషన్ల ఎస్‌ఐలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, ఎస్‌ఐ డి.వెంకన్న తదితరులు పాల్గొన్నారు.