
విత్తన శుద్ధి యూనిట్ తనిఖీ
తంగేడులో విత్తన శుద్ధి యూనిట్‌ను తనిఖీ చేస్తున్న అధికారులు
కోటవురట్ల: విత్తన శుద్ధి పరికరాలు, యంత్రాలు సక్రమంగా పనిచేసేలా పర్యవేక్షణ ఉండాలని జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి మహారాజన్ సూచించారు. తంగేడు కాటా వద్ద ఉన్న విత్తన శుద్ధి యూనిట్‌ను గుంటూరు కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆదేశాలతో వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లు, విత్తన శుద్ధి చేసిన ధాన్యం, యంత్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రికార్డులు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండాలన్నారు. విత్తన శుద్ధిలో నాణ్యతా లోపాలు లేకుండా చూడాలని సూచించారు. పర్యవేక్షణ లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అధికారి సింహాచలం, జిల్లా వ్యవసాయ క్వాలిటీ ఇన్‌స్పెక్టర్ సరోజిని, పాయకరావుపేట వ్యవసాయ సహాయ సంచాలకుడు ఉమాప్రసాద్, ఏవో సరోజిని, యూనిట్ యజమాని శివ పాల్గొన్నారు.