
విరమించుకోకపోతే తిరగబడతారు
పెదపల్లి, మంత్రిపాలెం గ్రామాలకు చెందిన రైతులంతా చిన్న, సన్నకారు రైతులే. చిన్న రైతుల్ని అన్యాయం చేసి భూములను లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటివి చేస్తే ప్రజలంతా తిరగబడే రోజులొస్తాయి. మా గ్రామాన్ని, మా భూములను కాపాడాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం.
–అనసూరి కృష్ణ, టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ
తాత ముత్తాతల నుంచీ వ్యవసాయమే..
తాత ముత్తాతల కాలం నుంచీ ఏదో రైతు పని చేసుకుని బతుకుతున్నాం. ఆవునో, మేకనో, కోడినో, కుక్కనో పెంచుకొని బతికేవాళ్లమి. మాకు కంపెనీలవీ వద్దండీ. పిల్లా జెల్లలతో ఉన్నాం. ఎక్కడికీ యెళ్లిపోలేం. మాకు కంపెనీలొద్దు, డబ్బొద్దు.. మా భూములు మాకుంచండి.. మీకు వందనాలు. –దంట్ల ఈశ్వర్రావు, 22వ వార్డు
మాకు భూములే కావాలి.. డబ్బులొద్దు
నాకు రెండెకరాల భూమి ఉంది. పంటలు పండించుకొని తింటున్నామండి. మాకు భూములే కావాలి. డబ్బులొద్దు. గొడ్లయ్యి ఉన్నాయండీ. సొమ్ములున్నాయండీ. ఎక్కడికి పోతామండి. దానిమీదే కష్టపడి బతుకుతున్నామండి. పూర్వీకుల నుంచి వచ్చిన భూమి వదులుకోలేం.
–గొంతిన సూర్యమణి, పెదపల్లి
బలవంతంగా తీసుకుంటే సచ్చిపోతాం
మాకు ఆ భూముంటే చాలండి. డబ్బులొద్దు. భూముంటే ఏదోలా కష్టపడైనా బతుకుతాం. ఇకవేళ బలవంతంగా మా భూములు తీసుకుంటే సచ్చిపోతామండి. మాకు ప్రాణాలెక్కువకాదు. ఉన్న మాటే సెబుతున్నా. –సేనాపతి నాగమణి, పెదపల్లి
●

విరమించుకోకపోతే తిరగబడతారు

విరమించుకోకపోతే తిరగబడతారు

విరమించుకోకపోతే తిరగబడతారు