
ఇద్దరిని రక్షించిన మైరెన్ పోలీసులు
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న
ప్రవల్లిక, రమణి
ఎస్.రాయవరం: రేవుపోలవరం తీరంలో సోమవారం స్నానం కోసం సముద్రంలో దిగిన మునిగిపోతున్న మహిళలను ఒడ్డున ఉన్న మైరెన్ పోలీసులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి. యలమంచిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన రాజాన రమణి, పోతిరెడ్డి పవల్లిక సముద్ర స్నానం కోసం తీరానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా కెరటాలకు లోపలికి కొట్టుకుపోయారు. మైరెన్ పోలీసు యర్జి అప్పలరాజు గుర్తించి కేకలు వేసి స్థానిక మత్స్యకారుల సహాయంతో ఇద్దరినీ ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. అప్పటికే నీరు తాగి అపస్మారక స్థితికి చేరుకున్న వారికి ప్రాథమిక చికిత్స అందించి నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఎన్‌టీఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాణాపాయ స్థితి తప్పిందని ఎస్.రాయవరం ఎస్‌ఐ విభీషణరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఇద్దరిని రక్షించిన మైరెన్ పోలీసులు