దేవరాపల్లి: కొత్తూరు ముత్యాలమ్మపాలెంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో 5 ఎకరాల మేర యూకలిఫ్టస్ తోటలు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన సిరసపల్లి రాము, సిరసపల్లి దేముడమ్మ, సిరసపల్లి రాములమ్మ, చౌడువాడ లక్ష్మీ, చౌడువాడ అప్పలనర్స, చౌడువాడ అప్పలనాయుడు, బోను సింహాచలంనాయుడు, లక్కరాజు భూషణంకు చెందిన తోటలు అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామస్తులంతా పొలం పనులకు వెళ్లిన సమయంలో కోళ్ల ఫారంకు ఎదురుగా ఉన్న యూకలిప్టస్ తోటల నుంచి మంటలు కనిపించడంతో స్థానికులు అక్కడుకు చేరుకున్నారు. అగ్ని కీలలు ఎగిసి పడడంతో మంటలను అదుపు చేయడం సాధ్యం కాలేదు. వెంటనే చోడవరం అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసి రప్పించామని, అప్పటికే తోటంతా కాలిపోయిందని స్థానిక సర్పంచ్ గంధం రామకృష్ణ తెలిపారు. మిగతా తోటలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది కృషి చేశారన్నారు. కాగా ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షలు విలువ చేసే తోటలు దగ్ధమయ్యాయి. ప్రభుత్వం తమకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
దిబ్బిడిలో ఆరు ఎకరాల్లో సరుగుడు తోట దగ్ధం
బుచ్చెయ్యపేట : దిబ్బిడి గ్రామంలో విద్యుత్ సార్ట్ సర్క్యూట్ కారణంగా ఆరు ఎకరాల్లో సరుగుడు తోటలు కాలిపోగా సుమారు రూ.నాలుగు లక్షలు ఆస్తి నష్టం జరిగింది. గ్రామంలో గల జర్తా వారి పొలాల్లో శనివారం విద్యుత్ వైర్లు కలిసిపోయి అగ్గినిప్పులు పడగా గాలికి రాజుకుని మంటలు వ్యాపించినట్టు బాధిత రైతులు తెలియజేస్తున్నారు. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన ముమ్మిన నాగరాజు, పాతాళ శ్రీనివాసరావు, కందికొండ శ్రీను, సేనాపతి సూరిబాబు, దేవుడమ్మ,బోధ అమ్మాజీ, ముమ్మిన నూకరాజులకు చెందిన సరుగుడు తోటలు కాలిపోయాయి. స్ధానికుల సమాచారం మేరకు చోడవరం అగ్పిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. మూడేళ్ల సరుగుడు తోటలు కాలిపోవడంతో రూ.4 లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు.
ఐదు ఎకరాల్లో యూకలిప్టస్ తోటలు దగ్ధం