చూసిన కనులదే భాగ్యం

ముడసర్లోవ ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టు వద్ద జీ 20 ప్రతినిధులు - Sakshi

రఘువంశోత్తముడు రామయ్య.. సుగుణాల రాశి సీతమ్మల కల్యాణ మహోత్సవానికి ప్రతి ఊరూ వేదికై ంది. ఆకాశాన్నంటుతూ పందిళ్లు కొలువుదీరగా.. ఊరివారంతా పెళ్లిపెద్దలయ్యారు. చూసిన వారికి చూడముచ్చటగా అంగరంగ వైభవంగా సీతారాముల పరిణయ వేడుకను జరిపించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జరిపించిన ఈ ఉత్సవం చూసిన కనులదే భాగ్యమంటూ భక్తులంతా పరవశించారు. ముత్యాల తలంబ్రాలను అక్షతలుగా స్వీకరించారు. – సాక్షి నెట్‌వర్క్‌

విశాఖలో మూడు రోజుల నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ 20 సదస్సు ముగింపు దశకు చేరుకుంది. మూడో రోజున పట్టణ మౌలిక సదుపాయాలకు ఫైనాన్సింగ్‌ సౌకర్యంపై భాగస్వామ్య దేశాలు వ్యూహ రచన చేశాయి. సదస్సు అనంతరం నగరంలో పలు ప్రాంతాల్లో విదేశీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ముడసర్లోవ ఫ్లోటింగ్‌ సోలార్‌, కాపులుప్పాడ వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌, స్కాడా సిస్టమ్‌లను సందర్శించారు. నగర అందాలకు జీ 20 దేశాల ప్రతినిధులు ముగ్ధులై.. వావ్‌ వైజాగ్‌ అని కితాబిచ్చారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ (ఐడబ్ల్యూజీ) సదస్సు గురువారం ముగియగా.. ఆఖరి రోజు శుక్రవారం దేశంలో వివిధ మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లతో సభ్యదేశాల ప్రతినిధులు సమావేశం కానున్నారు

వావ్‌.. వైజాగ్‌.!

క్షేత్ర పర్యటనలో జీ 20 దేశ ప్రతినిధుల కితాబు

పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై ప్రశంసలు

నగర అందాలకు ముగ్ధులైన విదేశీయులు

Read latest Anakapalle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top