జగనాభిమానం | - | Sakshi
Sakshi News home page

జగనాభిమానం

Nov 27 2026 1:02 AM | Updated on Nov 27 2026 1:02 AM

పల్లె పోరులో
పరిషత్‌ ఎన్నికల్లో ఏడు జెడ్పీటీసీలు, ఏడు ఎంపీపీ స్థానాలతో పాటు జెడ్పీ చైర్‌పర్సన్‌ పీఠాన్ని దక్కించుకున్న వైఎస్సార్‌సీపీ.. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ తన మద్దతుదారుల ద్వారా సత్తా చాటింది. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరగకపోయినా, గ్రామపోరులో ఆ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు. మెజారిటీ పంచాయతీల్లో విజయం సాధించి తమ ఆధిక్యాన్ని చాటుకున్నారు. దీంతో పరిషత్‌ ఎన్నికల నాటి ఫలితాల ప్రభావం గ్రామస్థాయి ఎన్నికల్లోనూ కనిపించిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

● పరిషత్‌ పట్టు.. పల్లెల్లోనూ ప్రభావం!

● పంచాయతీ ఎన్నికల్లోనూవైఎస్సార్‌సీపీ మద్దతుదారుల సత్తా

● కీలక స్థానాలు కైవసం

కొయ్యూరు: స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు కీలక పంచాయతీలను కై వసం చేసుకున్నారు. టీడీపీకి కంచుకోటగా నిలిచిన కొయ్యూరు, రాజేంద్రపాలెం పంచాయతీలను ఈ సారి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు కై వసం చేసుకున్నారు. మొత్తం 33 పంచాయతీల్లో 12 సర్పంచ్‌ స్థానాలు వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల పరమయ్యాయి. కొయ్యూరు సర్పంచ్‌గా సురబోయిన దివ్య కుమారి 14ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మండల కేంద్రం రాజేంద్రపాలెం పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు నర్సి కృష్ణ 82 మెజారిటీతో విజయం సాధించారు. బూదరాళ్ల సర్పంచ్‌ స్థానానికి కొర్రా తిరుపతిరావు 331 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బంగారంపేట స్థానానికి కొప్పు దుర్గారావు 329 ఓట్లు మెజారిటీ సాధించారు. ఎ.భీమవరం సర్పంచ్‌ స్థానానికి కొండ్ల చిలకమ్మ (96) అంతాడలో సుర్ల సలోమి (252) రేవళ్లలో జన్ని నాగేంద్ర(151), కొండగోకిరిలో పల అనూష(52), మూలపేటలో రావుల వరలక్ష్మి(181), పెదమాకవరంలో సెగ్గే నూకరాజు (12), ఆడాకులలో గమధం రాములమ్మ (42), చింతలపూడిలో సెగ్గే అరుణ్‌ కుమార్‌ (22), మూలపేట నుంచి రావుల వెంకటలక్ష్మి 180 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇతర పార్టీల మద్దతుతో నడింపాలెంలో అప్పలకొండ, శరభన్నపాలెంలో అచ్యుతవాణి, కినపర్తిలో దుర్గభవాని, డౌనూరులో జోగులమ్మ, మంపలో కె.లక్ష్మి, ఎం.మాకవరంలో సుర్ల ఆనంద్‌, బట్టపనుకులలో కృష్ణవేణి, బకులూరులో చంద్ర కుమారి, యూ.చీడిపాలెంలో చంద్రకళ, నల్లగొండలో పల్లి వరలక్ష్మి, మర్రివాడలో రాజారావు, కొమ్మికలో రాజేశ్వరి, చీడిపాలెం మాకాడ సత్యవతి, కినపర్తిలో దుర్గా భవానీ, రత్నంపేటలో లింగేటి శంకర్‌, గదబపాలెంలో నూకరాజు, నల్లగొండలో లోతా వరలక్ష్మి, రావణాపల్లిలో శ్రీనివాసరావు గెలుపొందారు. మంప ఎస్‌ఐ శ్రీనివాస్‌ బూదరాళ్ల, మర్రివాడలో బందోబస్తు కల్పించారు. ఈ ఎలాంటి శాంతి భద్రత లోపం లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు.

గూడెంకొత్తవీధి: మండలంలో వంచుల సర్పంచ్‌ స్థానానికి గెమ్మెలి సాంబశివ, జర్రెలలో బురిశెట్టి రత్నకుమారి, దామనాపల్లిలో కుందరి సత్యవతి విజయం సాధించారు. వీరంతా వైఎస్సార్‌ మద్దతు దారుల సహకారంతో గెలుపొందారు. లక్కవరపుపేటలో గడుతూరి సాయికుమారి, దేవరపల్లిలో సాయిప్రేమకుమారి, శంకాడలో వూలం భాస్కరరావు, రింతాడలో గుంటా కోటేశ్వరరావు గెలుపొందారు. వీళ్లంతా ఇతర పార్టీల మద్దతుతో గెలిచారు.

చింతపల్లిలోనూ హవా

చింతపల్లి: మండలంలో 17 పంచాయతీలు, 204 వార్డులకు గురువారం ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ జరిగింది. సర్పంచ్‌ స్థానాలకు 96 మంది, వార్డు పదవులకు 394 మంది పోటీపడ్డారు. అంజలి శనివారంలో కిల్లో చిన్నమ్మి విజయం సాధించారు. గొందుపాక సర్పంచ్‌ స్థానానికి బవుడు లింగమూర్తి, కిటుములలో గడుతూరి రాధాకృష్ణ, తమ్మెంగులలో వంతెల లక్ష్మి, ఎర్రబొమ్మలులో మామిడి దేవి, చింతపల్లిలో రేమల వరహాలమ్మ విజయం సాధించినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. వైఎస్సార్‌సీపీకి చెందిన మద్దతుదారులు చాలాచోట్ల విజయం సాధించారు. లంబసింగిలో కొర్రా రఘునాథ్‌, లోతుగెడ్డ కొర్ర పద్మ, అన్నవరం వంతల చంటి, కుడుముసారి పాంగి సుబ్బారావు, కొత్తపాలెం వనగల బెన్నుబాబు, కొమ్మంగి పాంగి గణబాబు గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement