తొలి విడత పోలింగ్‌ ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

తొలి విడత పోలింగ్‌ ప్రశాంతం

Nov 27 2026 1:02 AM | Updated on Nov 27 2026 1:02 AM

సాక్షి, పాడేరు: జిల్లాలో తొలివిడతగా మూడు మండలాల్లోని 65 పంచాయతీల్లో గురువారం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పోలీసుల భద్రత నడుమ ఎన్నికల అధికారులు పోలింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ కొనసాగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ గిరిజనులు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. మూడు మండలాల్లో కలిపి 1,60,317 మంది ఓటర్లకు గాను 94,349 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 58.85 శాతం పోలింగ్‌ నమోదైంది.

● కొయ్యూరు మండలంలో 67.35 శాతం పోలింగ్‌ నమోదైంది. మండలంలోని 33 పంచాయతీలకు బాలారం పంచాయతీ ఏకగ్రీవం కాగా, మిగిలిన 32 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 42,531 మంది ఓటర్లకు గాను 28,643 మంది ఓటు వేశారు.

● గూడెంకొత్తవీధి మండలంలో 55.45 శాతం పోలింగ్‌ నమోదైంది. 16 పంచాయతీల పరిధిలో 52,412 మంది ఓటర్లు ఉండగా, 29,062 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

● చింతపల్లి మండలంలోని 17 పంచాయతీల పరిధిలో 56.05 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 65,374 మంది ఓటర్లకు గాను 36,644 మంది ఓటు వేశారు.

పోలింగ్‌ వివరాలు

మండలం ఓటర్లు పోలైన ఓట్లు శాతం

కొయ్యూరు 42,531 28,643 67.35

గూడెం కొత్తవీధి 52,412 29,062 55.45

చింతపల్లి 65,374 36,644 56.05

మొత్తం 1,60,317 94,349 58.85

మూడు మండలాల్లో58.85 శాతం నమోదు

కొయ్యూరు, చింతపల్లి, జీకేవీధిమండలాల్లో పటిష్ట భద్రత

పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement