● జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌వంతల శాంతి ఆదేశం
పాడేరు రూరల్: జిల్లా పరిషత్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని నూతన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ వంతల శాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె జిల్లా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. తనకు కేటాయించిన చాంబర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో అరకు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు అప్పారావు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు రామన్న, నాయకులు చందు, చంటి, శ్రీను పాల్గొన్నారు.


