● మాజీ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర
ముంచంగిపుట్టు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఉమ్మడి విశాఖ మాజీ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర పిలుపునిచ్చారు. బుధవారం జోలాపుట్టు పంచాయతీ బొండ్రుగూడ, బరడ పంచాయతీ కేంద్రాల్లో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశాల్లో ఆమె మాట్లాడారు. మండలంలోని 23 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు, 14 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించేలా కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ, ప్రజలకు వాటిని వివరించాలని సూచించారు. అనంతరం కార్యకర్తలకు ఐడీ కార్డులు అందజేశారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు, జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ అరబీరు జగబంధు పాల్గొన్నారు.


