మోగింది మహానగారా | - | Sakshi
Sakshi News home page

మోగింది మహానగారా

Oct 15 2026 8:24 AM | Updated on Oct 15 2026 8:24 AM

● జీవీఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల ● గ్రేటర్‌ పీఠంపై కన్ను వేసిన ప్రధాన పార్టీలు ● మహిళా అభ్యర్థుల వేటలో అధిష్టానాలు

డాబాగార్డెన్స్‌: గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సమరం మొదలైంది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో నగరంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైఎస్సార్‌సీపీ ఒకవైపు, టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి మరోవైపు విశాఖ పీఠం కోసం వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ప్రత్యేకించి, 26 ఏళ్ల తర్వాత మేయర్‌ స్థానానికి ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతుండటం, ఆ పీఠాన్ని మహిళా కేటగిరీకి కేటాయించడం విశాఖ పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

కోడ్‌ అమల్లోకి..

షెడ్యూల్‌ విడుదలైన తక్షణమే కోడ్‌ అమల్లోకి వచ్చింది. కొత్త సంక్షేమ పథకాలు ప్రకటించడం, ఓటర్లను ప్రభావితం చేసే ప్రాజెక్టులు వెల్లడించడంపై నిషేధం ఉంటుంది. ఎలాంటి ప్రభుత్వ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, కొత్త నిధుల మంజూరు చేయడానికి వీలుండదు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, విద్యుత్‌ స్తంభాలు, డివైడర్లపై ఉన్న నాయకుల ఫ్లెక్సీలు, పోస్టర్లు, గోడ రాతలను అధికారులు తొలగిస్తున్నారు. ప్రచారానికి కార్పొరేషన్‌ ముందస్తు అనుమతి తప్పనిసరి.

26 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రత్యక్ష ఎన్నికలు!

ఈసారి జీవీఎంసీ ఎన్నికలు మరో కీలక పరిణామానికి వేదిక కానున్నాయి. గతంలో కార్పొరేటర్లు ఎన్నుకునే పరోక్ష విధానానికి భిన్నంగా మేయర్‌ పదవికి ప్రత్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. విశాఖలో చివరిసారిగా 2000లో మేయర్‌ పదవికి ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. దాదాపు 26 ఏళ్ల విరామం తర్వాత నగర ప్రథమ పౌరురాలిని ఓటర్లే నేరుగా ఎన్నుకోనుండటంతో ఈ ఎన్నికలకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో మేయర్‌ అభ్యర్థి ఎంపిక, ప్రజల్లో ఉన్న ఆదరణ, పార్టీల బలాబలాలు ఫలితాలను ప్రభావితం చేసే అంశాలుగా మారనున్నాయి.

మహిళకే మేయర్‌ పీఠం

జీవీఎంసీ మేయర్‌ పదవిని మహిళలకు కేటాయించారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాలుగా నిలిచే మహిళా నాయకురాళ్ల కోసం అన్వేషణ ప్రారంభించాయి. సామాజిక సమీకర ణాలు, రాజకీయ అనుభవం, ప్రజాదరణను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. నామినేషన్ల గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ప్రత్యక్ష ఎన్నిక లు, మహిళా రిజర్వేషన్‌ నేపథ్యంలో ఈసారి విశాఖ మేయర్‌ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

30నఓట్ల లెక్కింపు, ఫలితాలు

21న ఉపసంహరణకు చివరి గడువు.. సాయంత్రం 5 గంటలకు తుది జాబితా

28నపోలింగ్‌

ఎన్నికల షెడ్యూల్‌ ఇదీ..

16–18

తేదీల:

నామినేషన్ల స్వీకరణ

19న

నామినేషన్ల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement