విద్యుత్‌ షాక్‌తో వృద్ధుడి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో వృద్ధుడి మృతి

Oct 15 2026 8:24 AM | Updated on Oct 15 2026 8:24 AM

రావికమతం: మండలంలోని దొండపూడి శివారు సీతారామపురం వద్ద బుధవారం విద్యుత్‌ షాక్‌తో ఓ వృద్ధుడు మృతి చెందాడు. కొత్తకోటకు చెందిన కర్రి కొండబాబు(60) సరుగుడు చెట్లు నరికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రివలస గ్రామానికి చెందిన ఓ సరుగుడు వ్యాపారి తోటను కొనుగోలు చేశాడు. చెట్లను నరికి లారీలో లోడు చేసేందుకు ఐదుగురు కూలీలతో కలిసి కొండబాబు పనికి వెళ్లాడు. చెట్లను కత్తితో నరుకుతుండగా ఓ చెట్టు విరిగి తోట పక్కనే ఉన్న విద్యుత్‌ తీగలపై పడింది. దీంతో కొండబాబు చేతిలోని కత్తికి విద్యుత్‌ సరఫరా కావడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య అప్పలనర్సమ్మ, కుమారుడు రాజు, కుమార్తె రత్నం ఉన్నారు. సమాచారం అందుకున్న కొత్తకోట ఇన్‌చార్జి ఎస్‌ఐ రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కూలీలు, బంధువుల సమక్షంలో శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement