ఇంగ్లిష్ గ్రామర్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న డీఎస్పీ నరసింహారావు
అనకాపల్లి : ప్రస్తుత విద్యా, ఉద్యోగ, వృత్తి ప్రపంచంలో ఆంగ్లభాషా నైపుణ్యానికి విశేష ప్రాధాన్యం ఉందని, నేడు ఆంగ్లం వివిధ దేశాలు, వృత్తులు, సంస్కృతులకు చెందిన వ్యక్తులను అనుసంధానించే ప్రపంచవ్యాప్త కమ్యూనికేషన్ మాధ్యమంగా ఆంగ్ల భాషకు ఎంతో ప్రాముఖ్యత ఉందని డీఎస్పీ పి.వి.వి.నరసింహారావు అన్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏపీఎంఎస్ అండ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంగ్లిష్ అధ్యాపకుడు విల్లూరి ఉమా మహేశ్వరరావు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ స్పష్టంగా, కచ్చితంగా, సందర్భోచితంగా, ప్రభావవంతంగా భావాలను వ్యక్తీకరించడం ప్రతి అభ్యాసకుడికి అవసరమని తెలిపారు. ఈ గ్రంథం విద్యార్థులకు, పోటీ పరీక్షల అభ్యర్థులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగార్ధులకు, ఆంగ్ల భాషాభిమానులకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. నేటి విద్యా, ఉద్యోగ, వృత్తి, పోటీ ప్రపంచంలో ఆంగ్లభాషా నైపుణ్యం ఎంతో కీలకమని, ఆలోచనను స్పష్టంగా వ్యక్తీకరించడం, భావాన్ని కచ్చితంగా తెలియజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సీఐలు జి. ప్రేమ్కుమార్, ఎం.వెంకట రమణ, ఎస్ఐలు జి. రవికుమార్, వి. శేఖర్, ఏఎస్ఐ వై. నూకరాజు, అప్పారావు పాల్గొన్నారు.


