డుంబ్రిగుడ: ఆదివాసీ గిరిజన సంప్రదాయ థింసా నృత్యానికి డప్పు, టముకు వాయిద్యాలతో సేవలందించిన ప్రముఖ కళాకారుడు కమ్మిడి బంటు(65) అనారోగ్యంతో శనివారం ఉదయం పాడేరు జిల్లా ఆసుపత్రిలో మృతి చెందారు. డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గ్రామంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో డప్పు, టముకు వాయిద్య కళాకారుడిగా ఆయన గుర్తింపు పొందారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, చైన్నె తదితర ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్వహించిన థింసా నృత్య ప్రదర్శనల్లో పాల్గొని తన వాయిద్య కళతో ఆదివాసీ సంప్రదాయాలను చాటిచెప్పారు. ఆయన మృతితో ఆదివాసీ కళారంగంలో విషాదం నెలకొంది. పలువురు కళాకారులు, స్థానికులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.


