శాసీ్త్రయ పద్ధతులతో పసుపులో అధిక దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

శాసీ్త్రయ పద్ధతులతో పసుపులో అధిక దిగుబడులు

Oct 11 2026 12:27 AM | Updated on Oct 11 2026 12:27 AM

చింతపల్లి: గిరిజన రైతులు పసుపు సాగులో శాసీ్త్రయ పద్ధతులను అవలంబించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని స్పైస్‌ బోర్డు సీనియర్‌ అధికారి బొడ్డు కళ్యాణి తెలిపారు. శనివారం బలపం పంచాయతీ పరిధిలోని గుంజివీధి గ్రామంలో స్పైస్‌ బోర్డు ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పసుపు సాగులో పాటించాల్సిన మెళకువలను వివరించారు. రైజ్డ్‌ బెడ్‌ పద్ధతిలో పసుపు సాగు చేయ డం ద్వారా పొలంలో నీరు నిలిచే సమస్యను తగ్గించడంతో పాటు దుంపకుళ్లు వ్యాధిని నివారించవచ్చని చెప్పారు. ఈ పద్ధతిలో నేలలో గాలి ప్రసర ణ మెరుగుపడి మొక్కల ఎదుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. నాణ్యమైన తల్లి దుంపలను విత్తనంగా వినియోగించడం ద్వారా అధిక దిగుబడులు సాధించే అవకాశాలు పెరుగుతాయని వివరించారు. అలాగే ట్రైకోడెర్మా వినియోగంతో నేలలోని హానికర శిలీంధ్రాలను నియంత్రించి దుంపకుళ్లు, వేరుకుళ్లు వంటి వ్యాధుల ఉధృతిని తగ్గించవచ్చని సూచించారు. స్పైస్‌ బోర్డు టెక్నికల్‌ అసోసియేట్‌ డాక్టర్‌ లోకేశ్వర్‌ జీవామృతం తయారీ, వినియోగ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇచ్చారు. జీవామృతం వినియోగం వల్ల నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూసారం మెరుగుపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం భాస్కర్‌రావు, పలువురు రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement