అనకాపల్లి : జీవీఎంసీ మొయిన్‌రోడ్డు పెద్ద హైస్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి జి.సుభాని వెయిట్ లిఫ్టింగ్‌లో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్టు స్కూల్ హెచ్‌ఎం బ్రహ్మాజీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారం రోజుల్లో కాకినాడ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని కోరారు. క్రీడాకోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చన్నారు.


