బృందగాన పోటీల విజేతలు
అనకాపల్లి టౌన్ : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, దేశభక్తి, జాతీయ సమైక్యతా భావాన్ని గీతాల ద్వారా చాటిచెప్పే లక్ష్యంతో భారత వికాస పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బృంద గాన పోటీల్లో పట్టణానికి చెందిన డీఏవీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు. ద్వితీయ, తృతీయ బహుమతులను శ్రీ ప్రకాష్ విద్యార్థులు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ సత్యవతి, డాక్టర్ కె.విష్ణుమూర్తి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ భారతీయ సంస్కృతులు ప్రపంచానికే ఆదర్శప్రాయమన్నారు. అనేక భాషలు, మతాలు, ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పడం మన దేశ ప్రత్యేకకత అని అన్నారు. ఈ బృందగాన పోటీలలో విజేతలకు వారు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో భారత వికాస పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.


