ఓట్ల తొలగింపుపై సీఐటీయూ, ప్రజాసంఘాల నిరసన | - | Sakshi
Sakshi News home page

ఓట్ల తొలగింపుపై సీఐటీయూ, ప్రజాసంఘాల నిరసన

Oct 11 2026 12:27 AM | Updated on Oct 11 2026 12:27 AM

అరకులోయ టౌన్‌(డుంబ్రిగుడ): రాష్ట్రంలో ఏకంగా 45 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించారని, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని సీఐటీయూ, వివిధ రైతు, ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. ఈ మేరకు శనివారం అరకులోయ కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న నిరసనలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అణచివేయాలని చూడటం దారుణమన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పౌరులు స్వేచ్ఛగా నిరసన తెలిపే హక్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం వాటిని సైతం తృణప్రాయంగా తీసుకుంటోందని విమర్శించారు. ఢిల్లీకి నిరసనకారులు రాకుండా మెట్రో సేవలు, ఇతర రవాణా వ్యవస్థలను నిలిపివేయడం బీజేపీ ప్రభుత్వ భయానికి నిదర్శనమన్నారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి(సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, మగ్గన్న, కోటేశ్వరరావు, మహాదేవ్‌, రైతు సంఘం, గిరిజన సంఘం నాయకులు జగన్నాథం, హరి, సీపీఎం మండల కార్యదర్శి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement