హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వం

Oct 11 2026 12:27 AM | Updated on Oct 11 2026 12:27 AM

అరకులోయ టౌన్‌ (డుంబ్రిగుడ): మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, కొత్తగా ఒక్క పింఛన్‌ కూడా మంజూరు చేయలేదని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య విమర్శించారు. అనంతగిరి మండలంలోని పెద్దబిడ్డ, లుంగపర్తి, కొండిభా, టోకూరు పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, బూత్‌ కమిటీల బలోపేతం, ఐడీ కార్డుల పంపిణీతో పాటు పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీలు టి.మితుల, శెట్టి నీలవేణి, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, మండల, గ్రామ కమిటీల అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement