రాష్ట్ర హాకీ పోటీలకు ఎంపికై న విద్యార్థినులు
నక్కపల్లి : ఇటీవల నక్కపల్లిలో జరిగిన హాకీ పోటీల్లో నక్కపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్17, అండర్ 19 విభాగంలో బాలబాలికలకు జరిగిన పోటీల్లో ఐదుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్17 విభాగంలో ఎం.కుసుమ, కె.అస్మిత, కె.కుసుమ, ఐ.మెర్సి, అండర్ 19 విభాగంలో కె.దీపిక ఎంపికై నట్టు ప్రన్సిపాల్ ఉషారాణి తెలిపారు.
తైక్వాండోలో...
పాయకరావుపేట : స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల విశాఖపట్నంలో జరిగిన అండర్19 కేటగిరి తైక్వాండో పోటీల్లో పాయకరావుపేట శ్రీప్రకాష్ విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. ఎం.సాయిగణేష్, కె.వి.ఎన్.కిషోర్ అత్యుత్తమ ప్రతిభ కనపరచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్టు ప్రిన్సిపాల్ వి.వి.ఎస్.ఎన్ భానుమూర్తి తెలిపారు. ఆయా విద్యార్థులను విద్యాసంస్థల అధినేత నరసింహరావు, సంయుక్త కార్యదర్శి విజయ్‌ప్రకాష్ అభినందించారు.


