ముంచంగిపుట్టులో కురుస్తున్న మంచు
ముంచంగిపుట్టు: మండలంలో మంచు ప్రభావం మొదలైంది. శుక్రవారం ఉదయం మండల కేంద్రం దట్టమైన మంచుతో కప్పబడింది. మంచు తీవ్రత పెరగడంతో రోజువారీ పనులకు వెళ్లే కూలీలు, ఉద్యోగులు, వ్యాపారులు చలితో వణుకుతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమవుతున్న చలి తీవ్రత ఉదయం 9 గంటల వరకు అధికంగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు గ్రామాల్లో చలి మంటలు వేసుకుంటున్నారు. దట్టమైన మంచు కారణంగా వాహనదారులు హెడ్‌లైట్లు వేసుకొని రాకపోకలు సాగిస్తున్నారు.


