ఆధార్‌ సేవా కేంద్రం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఆధార్‌ సేవా కేంద్రం ప్రారంభం

Oct 10 2026 1:10 AM | Updated on Oct 10 2026 1:10 AM

ఆధార్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న

జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ

పాడేరు రూరల్‌: గిరిజన ప్రాంత ప్రజలు ఆధార్‌ సేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ సూచించారు. శుక్రవారం పాడేరు నక్కలపుట్టు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్‌ సేవా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఆధార్‌లో పేరు, పుట్టిన తేదీ, వయస్సు, ఇంటిపేరు తదితర వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం ఆదివారాల్లోనూ కేంద్రం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్‌ కృపానందం, రీజనల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌కుమార్‌, ఆధార్‌ కేంద్రం ఆపరేషన్‌ మేనేజర్‌ నాగరాజు, సిబ్బంది ఆనంద్‌, కుమార్‌, అనిల్‌కుమార్‌, సతీష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement