కిరండూల్‌ రైళ్లు రద్దు.. గమ్యం కుదింపు | - | Sakshi
Sakshi News home page

కిరండూల్‌ రైళ్లు రద్దు.. గమ్యం కుదింపు

Oct 6 2026 12:36 AM | Updated on Oct 6 2026 12:36 AM

తాటిచెట్లపాలెం: రాయగడ డివిజన్‌లోని మలిగుడ–చత్రిపుట్‌ స్టేషన్ల మధ్య కొండచరియలు విరిగిపడటంతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు కిరండూల్‌–విశాఖపట్నం (18516), విశాఖపట్నం–కిరండూల్‌ (18515) నైట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేశారు. అలాగే విశాఖపట్నం–కిరండూల్‌ (58501), కిరండూల్‌–విశాఖపట్నం (58502) పాసింజర్‌ రైళ్లు కోరాపుట్‌ వరకే రాకపోకలు సాగించనున్నాయి. కోరాపుట్‌–కిరండూల్‌ మధ్య రైళ్లు నడవవని విశాఖపట్నం డివిజన్‌ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement