బంగారుమెట్ట గోతుల్లో బోల్తా పడిన ట్రాక్టర్
బుచ్చెయ్యపేట: భీమునిపట్నం – నర్సీపట్నం(బీఎన్) రోడ్డులో బంగారుమెట్ట వద్ద ఆయిల్‌పామ్ గెలల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. మాడుగుల మండలం కృష్ణపాలెంకు చెందిన రైతు తన పొలంలో పండిన ఆయిల్‌పామ్ గెలలను లోపూడి వద్ద ఫ్యాక్టరీకి తరలిస్తున్నాడు. శనివారం రాత్రి బంగారుమెట్ట గోతులు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో వడ్డాది, రావికమతం మధ్య వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో పామాయిల్ ఫ్యాక్టరీ నుంచి మరో ట్రాక్టర్‌ను రప్పించి గెలలను లోడ్ చేసి ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా చేశారు. ప్రమాద సమయంలో గోతులు వద్ద వాహనదారులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తక్షణమే రోడ్డు గోతులను పూడ్చాలని పలువురు కోరుతున్నారు.


