విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలి

Oct 4 2026 11:43 AM | Updated on Oct 4 2026 11:43 AM

● పీడీఎస్‌వో జిల్లా మహాజన సభ డిమాండ్‌ ● చోడవరంలో విద్యార్థుల భారీ ర్యాలీ

చోడవరం: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్‌ షిప్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌వో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. సురేష్‌ డిమాండ్‌ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (పీడీఎస్‌వో) జిల్లా మహాజన సభ చోడవరంలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా సురేష్‌ మాట్లాడుతూ విద్యార్థులకు రూ. 7 వేల కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. ధరలకు అనుగుణంగా హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌ చార్జీ రూ. 3 వేలకు పెంచాలని, ఖాళీగా ఉన్న వార్డెన్స్‌, కుక్స్‌, కమాటీ, వాచ్‌మెన్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, విద్యార్థులకు దుప్పట్లు, దోమతెరలు ఇవ్వాలన్నారు. జనసాహితీ జిల్లా కార్యవర్గ సభ్యుడు గౌరీశంకర్‌ మాట్లాడుతూ నీట్‌ వంటి అత్యున్నత పరీక్షల్లో సైతం పేపర్‌ లీకేజీలు జరిగితే విద్యార్థుల భవిష్యత్‌ ఏంటని ప్రశ్నించారు. అటువంటి పేపర్‌ లీకేజీలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశానికి ముందు మెయిన్‌రోడ్డుపై విద్యార్థులంతా భారీ ర్యాలీ నిర్వహించారు. చోడవరం, నర్సీపట్నం, ఎలమంచిలి ప్రాంతాల్లో బడిబస్సులు సకాలంలో లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బడిబస్సులు నడపాలని, అనకాపల్లిలో ప్రభుత్వం డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని, నిరుద్యోగుల ఆకలి చావులు ఆగాలంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌వో రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు ఎస్‌. రుద్రి, నందారపు భాస్కరరావు, బి. రాజేష్‌, కారే మణికుమార్‌, గౌతం కుమార్‌, పి. సాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement