‘స్థానిక’ ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ

Oct 4 2026 11:43 AM | Updated on Oct 4 2026 11:43 AM

● మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు

అనకాపల్లి : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు స్పష్టం చేశారు. అనకాపల్లిలోని పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయమై చర్చించి ప్రసంగించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ క్షణాన్నైనా ప్రకటన వెలువడవచ్చునన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం సమాయత్తం అవుతున్నాయన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో స్థానిక ఎన్నికల్లో ఎటువంటి అరాచకాలు చేయలేదన్నారు. కానీ కూటమి పాలనలో రెండున్నరేళ్లలో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేకపోయారన్నారు. దీంతో గెలుస్తామనే నమ్మకం లేక స్వేచ్ఛగా ఎన్నికలు జరపకుండా ఏదో విధంగా అరాచకాలు చేసి, తప్పుడు కేసులతో స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలవాలని చూస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా, కేసులు పెట్టాలని, పోలీసులతో ఇబ్బందులు కలిగిస్తున్నా వెరవకుండా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పార్టీ శ్రేణులు పోటీకి సమాయత్తం చేశామన్నారు. ఈ విషయమై పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక ఎన్నికలకు సమాయత్తంపై దిశానిర్దేశం చేశారన్నారు. స్థానిక ఎన్నికల్లో జిల్లా సమస్యలతో పాటు ఆయా నియోజకవర్గాల్లోను, మండలాల్లోని సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను క్రోడీకరించి ఎన్నికల ప్రచారంలో దిగువ స్థాయి వరకు తీసుకెళ్లాలన్నారు. చోడవరం, మాడుగులకు సంబంధించి నడుస్తున్న గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీని పూర్తి స్థాయిలో మూతపడే స్థితికి ఏ విధంగా తీసుకెళ్లారనే విషయాన్ని తీసుకెళ్లాలన్నారు. యలమంచిలిలో పంచదార్ల సమస్యను తీసుకు వచ్చారన్నారు. ఇలా నియోజక వర్గాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని, విజయమే లక్ష్యంగా కలసికట్టుగా పని చేయాలని పార్టీ నాయకులు, శ్రేణులకు పిలుపు నిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, పార్టీ పార్లమెంటు పరిశాలకురాలు శోభా హైమావతి నియోజక వర్గాల పార్టీ సమన్వయకర్తలు కరణం ధరశ్రీ(యలమంచిలి), పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ (నర్సీపట్నం), కంబాల జోగులు (పాయకరావుపేట), అన్నంపురెడ్డి అదీప్‌రాజ్‌(పెందుర్తి) సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల మహిళా విభాగం వర్కింగ్‌ అధ్యక్షురాలు ఈర్లె అనురాధ, పార్లమెంట్‌ పరిశీలకురాలు శోభా హైమావతి, మాజీ ఎంపీ బి.వి.సత్యవతి, వివిధ నియోజకవర్గాల పరిశీలకులు పి.సతీష్‌వర్మ, చిక్కాల రామారావు, దంతులూరి దిలీప్‌కుమార్‌, గండి రవి, పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement