మెట్ట భూమిలో ఐదు ఎకరాల వరకు సీతాఫలాల తోటలను సాగు చేస్తున్నాను. ప్రతి ఏడాది సీతాఫలాల అమ్మకాలతో మా కుటుంబానికి రూ. లక్షకు పైగానే ఆదాయం వస్తోంది. సీతాఫలాల తోటలు మా ప్రాంతానికి వరంగా మారాయి.
– గుల్లె రాము, చోడిపల్లి, పాడేరు మండలం
ఈ ఏడాది కాపు బాగుంది
మా తోటల్లో ఈ ఏడాది కూడా కాపు బాగుంది. ఈ మూడు వారాల వ్యవధిలో ఇప్పటివరకు 20 బుట్టల సీతాఫలాలను విక్రయించాను. రూ. 12 వేల ఆదాయం లభించింది. మరో రెండు నెలల వరకు కాపు వస్తుంది.
– సోమెలి మత్స్యకొండమ్మ, మెట్టలపాడు, జి.మాడుగుల మండలం


