అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయటౌన్: డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. విద్యార్థులు, యువత, నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలు, డీఎస్సీలో జరిగిన అక్రమాలపై స్థానిక టౌన్ హాల్‌లో సోమవారం జరిగిన చర్చా కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణించిన వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా తమకు నచ్చినవారికి ఇవ్వడం దారుణమన్నారు. ఒక్కో పోస్టును రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ కూటమి నాయకులు అమ్ముకున్నారని ఆరోపించారు. అంతులేని అక్రమాలు చోటు చేసుకున్న డీఎస్సీపై వైఎస్సార్ సీపీ కచ్చితమైన ఆధారాలు చూపించిందని, అయినప్పటికీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోకేష్ రాజీనామా చేసేవరకు వైఎస్సార్‌సీపీ ఉద్యమిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణిక్య, వైఎస్సార్–టీఎస్సార్ పౌండేషన్ వ్యవస్థాపకుడు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి టి.సురేష్ కుమార్, పార్టీ జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిరి రవి ప్రసాద్, రాష్ట్ర విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీ నాగభూషణ్, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, జెడ్పీటీసీ చటారి జానకమ్మ, నియోజకవర్గం గ్రీవెన్స్‌సెల్ అధ్యక్షుడు సందడి కొండబాబు, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు వెంకట పూర్ణిమ, వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి, నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల అధ్యక్షులు స్వాభి రామూర్తి, పాంగి పరశురామ్, కొర్రా సూర్యనారాయణ, పాంగి అనిల్ కుమార్, మజ్జి చంద్రుబాబు, మండల ఉపాధ్యక్షులు పల్టాసింగ్ విజయ్ కుమార్, జి.ప్రకాష్‌రావు, ఎంపీటీసీలు దురియా ఆనంద్ కుమార్, జయవర్ధిని,లలిత, శత్రుఘ్న, పూర్ణ, చిరంజీవి, పరశురామ్, మాజీ సర్పంచ్‌లు పెట్టెలి సుస్మిత, పాగి అప్పారావు, గుమ్మ నాగేశ్వరరావు, కిముడు హరి, రమేష్, నాయకులు నరసింహమూర్తి, బాలరాజు, పాంగి నాగేశ్వరరావు, మాధురి శివ, సన్యాసిరావు, కిల్లో జగన్, తదితరులు పాల్గొన్నారు.


